GDWL: గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని బీఆర్ఎస్ గద్వాల జిల్లా అధ్యక్షుడు బాసు హనుమంతు నాయుడు పేర్కొన్నారు. గట్టు మండలం సల్కాపురం గ్రామంలో బీఆర్ఎస్ మద్దతుతో విజయం సాధించిన నూతన సర్పంచ్ బోయ తిమ్మప్ప, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను శాలువాలతో సత్కరించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్దే రాజ్యమని ఆయన అన్నారు.