SRD: గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. కొండాపూర్ మండలంలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు ఎమ్మెల్యేను ఆదివారం కలిశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సర్పంచులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.