TG: తూర్పు వరంగల్‌లో గ్రూప్ వార్ జరుగుతోంది. కాంగ్రెస్ మైనార్టీ నేత సాజిద్‌పై దాడి జరిగింది. మంత్రి కొండా సురేఖ అనుచరుడు నవీన్ రాజ్‌ను ఫోన్లో ప్రశ్నించినందుకే దాడి చేశారని సాజిద్ ఆరోపించాడు. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు కొండా వర్గం ముఖ్యనేతలతో మాజీ మంత్రి బస్వరాజు సారయ్య భేటీ అయ్యారు.