TG: బాలయ్య అఖండ-2 మూవీ టికెట్ల వివాదంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. బుక్ మై షో సైట్లో ధరలు మార్చకపోవడంతో ఆ సంస్థపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు అంటే లెక్కలేదా అని ప్రశ్నించింది. తమకు ఉత్తర్వులు అందేలోపే ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారని బుక్ మైషో తెలిపింది. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.