NLG: నకిరేకల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో పయనించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బెజవాడ సైదులు, వార్డు సభ్యులకు మద్దతుగా సోమవారం రాత్రి ప్రచారాన్ని నిర్వహించారు.