BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి నిత్యఖజానాకు సోమవారం రూ.29,60,654 ఆదాయం వచ్చినట్లు ఈవో వెంకట్రావు తెలిపారు. ఇందులో ప్రసాద విక్రయాలతో రూ.8లక్షలు, వీఐపీ దర్శనాలతో రూ.4.65 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.2.51 లక్షలు, కార్ పార్కింగ్ తో రూ.2.33 లక్షల ఆదాయం వచ్చింది. తదితర విభాగాల నుంచి కూడా ఆదాయం సమకూరింది.