ఎంపీ రేణుకాచౌదరి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీ రేణుకా చౌదరిపై ప్రివిలేజ్ నోటీసులు జారీ చేశారు. ఎంపీలు బ్రిజ్లాల్, బాలగోస్వామి నోటీసులు ఇచ్చారు. దీనిని రాజ్యసభ ఛైర్మన్ ప్రివిలేజ్ కమిటీకి పంపారు. కాగా, రేణుకా చౌదరి ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.