PLD: వినుకొండ మండలంలోని విఠంరాజుపల్లి వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. కారు, ద్విచక్ర వాహనం ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి వాహనంపై నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.