KRNL: ఆదోనీని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రజా డిమాండును MLC బీటీ నాయుడు ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు. స్థానికంగా జరుగుతున్న ఉద్యమాలు, దీక్షలు, సంఘాల పోరాటాలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఆయన, భౌగోళిక-పరిపాలనా అవసరాల దృష్ట్యా ఆదోనీ జిల్లా హోదా ఇవ్వాలని అభ్యర్థించారు. ఆదోనీకి జిల్లా హోదాకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్నారు.