GNTR: జిల్లాలో స్క్రబ్ టైఫస్ మరణాలు సంభవించకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్లో కలెక్టర్ స్క్రబ్ టైఫస్ నివారణ, ముందస్తు జాగ్రత్త చర్యలు, హౌసింగ్, ఉపాధి హామీ పనులు, గ్రామ వార్డు సచివాలయాల సేవలతో సహా పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.