ATP: రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన ముగ్గురు యువకులు భారత సైన్యంలో చేరిన సందర్భంగా రాయదుర్గం పట్టణంలో ఘనంగా సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి హాజరై మహేష్, సందీప్, ఫణి కుమార్ అనే యువ సైనిక అభ్యర్థులను అభినందించారు. దేశ రక్షణలో యువత ముందుకు రావడం రాయదుర్గం ప్రాంతానికి గర్వకారణమని ఆయన కొనియాడారు.