NLG: చిట్యాల పట్టణానికి చెందిన ఫోటోగ్రాఫర్ ఏళ్ల బయ్యన్న తీసిన ఛాయా చిత్రాలకు ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డును అందుకున్నారు. డిసెంబర్ 6,7 తేదీల్లో తెలుగు ఆర్ట్ ఫోటోగ్రఫీ, వివిద్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ నిర్వహించిన లంబాడా తెగ జీవనశైలి, ఆచార వ్యవహారాలపై తీసిన ఛాయాచిత్రాలకు గాను అసోసియేషన్ నిర్వాహకులు కుమారస్వామి, రామకృష్ణ, భార్గవ్ లు అవార్డును అందించారు.