NGKL: జిల్లా కేంద్రంలోని స్థానిక శారద ఉన్నత పాఠశాలలో సోమవారం షీ టీమ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలికలు, మహిళలను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని షీ టీమ్ హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య హెచ్చరించారు. ఏ సమస్య వచ్చినా వెంటనే 8712657676 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాల ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని వెంకట్ రాములు తెలిపారు.