KRNL: కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో PGRS, స్వామిత్వ పథకం అమలు, వీధికుక్కల నియంత్రణ వంటి కీలక అంశాలపై జిల్లా కలెక్టర్ ఏ.సిరి ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అధికారులు, మండల స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రస్తుత పరిస్థితులు, సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.