GNTR: తెనాలి మారీసుపేటలో రెండు గేట్ల మధ్య నిరుపయోగంగా ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ సోమవారం మళ్లీ అందుబాటులోకి వచ్చింది. గతంలో ఇక్కడ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయగా వినియోగించకపోవడంతో రూపు రేఖలు మారిపోయి అసాంఘిక చర్యలకు అడ్డగా మారింది. త్రీ టౌన్ సీఐగా బాధ్యతలు చేపట్టిన సాంబశివరావు పోలీస్ అవుట్ పోస్ట్‌పై దృష్టి సారించి మరమ్మతులు చేయించి వినియోగంలోకి తెచ్చారు.