KMM: అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల సందర్భంగా సోమవారం కలెక్టర్ శ్రీ అనుదీప్ దురిశెట్టి ACB పోస్టర్ను విడుదల చేశారు. అవినీతిపై ప్రజలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1064తో పాటు, వాట్సాప్, ఈమెయిల్, ACB, ఖమ్మం DSP నంబర్ 9154388981 ద్వారా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.