WGL: రాయపర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో జరుగుతున్న ఎన్నికల ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ శిబిరాన్ని ఇవాళ జిల్లా కలెక్టర్ సత్య శారద సందర్శించారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్ విధానాలు, సిబ్బంది బాధ్యతలపై ఇచ్చిన సూచనలు, శిక్షణా కార్యక్రమం అమలు ఎలా జరుగుతోందన్న విషయాలను ఆమె సమీక్షించారు. అవసరమైన మార్గదర్శకాలను అందించాలని సూచించారు.