నిజామాబాద్‌లోని గంగస్తాన్ పేస్ 2 రామకృష్ణ మఠంలో ‘భేటీ పడావ్ భేటీ బచావ్’ కార్యక్రమంలో బాల్యవివాహాలు, డ్రగ్స్ వంటి అంశాలపై శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా CP శ్రీ సాయి చైతన్య మాట్లాడుతూ.. ఆడపిల్లలకు సరైన వయసులో వివాహం చేయాలని, లేదంటే పుట్టబోయే పిల్లలకు అంగవైకల్యం, బుద్ధిమాంద్యం వంటి సమస్యలు తలెత్తుతాయని సూచించారు.