HNK: మాజీ మంత్రి తిరువరంగం హయగ్రీవాచారి విగ్రహానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నివాళులర్పించారు. హయగ్రీవాచారి వర్ధంతి సందర్భంగా హనుమకొండ అశోక జంక్షన్ సమీపంలోని హయగ్రీవచారి విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేశారు. అనంతరం మాజీ మంత్రి హయాగ్రీవచారి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.