AP: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్కు డిప్యూటీ సీఎం పవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థుల ఆలోచనలు, ప్రవర్తనే మన దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయని అన్నారు. ప్రతి విద్యార్థిలోనూ నిగూఢమైన శక్తి దాగి ఉంటుందన్నారు. దానిని వెలికితీసి విద్యార్థులను ప్రతిభావంతులుగా తయారు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.