TG: కరీంనగర్ జిల్లా సిర్సపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమేష్-రజిత దంపతులు పెద్ద కుమారుడు అభిలాష్ (19) సింగాపురం కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఇవాళ ఇంట్లోని బాత్రూంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.