CTR: విజయపురం(M) శ్రీహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. HM వెంకమరాజు మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. పాఠశాలలో బోధన, అభ్యాసన సామగ్రి, ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఎంపీడీవో సుబ్రమణ్యం రాజు, ఉపాధ్యాయులు సురలక్ష్మి, సురేష్ పాల్గొన్నారు.