భారత వాణిజ్యానికి రష్యా అండగా నిలుస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య ఉన్న వ్యాపార సంబంధాలు పరస్పర ప్రయోజనం కలిగిస్తున్నట్లు తెలిపారు. పుతిన్ నేతృత్వంలో భారత్-రష్యా సంబంధాలు బలోపేతం అయ్యాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుతాయని ధీమా వ్యక్తం చేశారు. 2030 వరకు ఇరుదేశాల మధ్య ఆర్థిక ప్రణాళికలపై ఒప్పందం కుదిరినట్లు తెలిపారు.