E.G: గోకవరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్డేను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన బోధన సిబ్బందితోపాటు సకల సౌకర్యాలు ఉన్నాయన్నారు.