JGL: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుగ్గారం మండల విద్యా వనరుల కేంద్రంలో కార్య క్రమం జరిగింది. దివ్యాంగ చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఎంఎండీఓ సుమంత్, ఎంఈఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దివ్యాంగులను ప్రోత్సహిస్తే వారు ఉన్నత స్థాయికి చేరగలరన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు.