సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ నెల 31వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.