TG: సైబరాబాద్ పోలీసుల అధికారిక వెబ్సైట్ ప్రజలకు అందుబాటులో ఉందని డీసీపీ వై.వీ.ఎస్. సుధీంద్ర తెలిపారు. నవంబర్ 15, 2025 నుంచి వెబ్సైట్ మెయింటెనెన్స్, అప్‌గ్రేడ్ పనుల కారణంగా తాత్కాలికంగా అందుబాటులో లేదన్నారు. అత్యవసర సాంకేతిక నిర్వహణ, భద్రతను పెంచేందుకు చేపట్టిన పనుల కారణంగానే వెబ్ సైట్ డౌన్‌టైమ్ జరిగిందన్నారు.