తెలంగాణలో ‘అఖండ 2’ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే, పెంచిన ధరల ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో 20 శాతం ‘మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్’కు వెళ్లనుంది. ఈ మేరకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకంగా ఒక బ్యాంక్ ఖాతాను తెరిచింది. ఈ మొత్తాన్ని సినీ పరిశ్రమలోని కార్మికుల సంక్షేమం కోసం వినియోగించనున్నారు.