PDPL: ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన వేల్పుల రఘురాం ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడి మృతి చెందాడు. సుల్తానాబాద్ నుంచి రఘురాం పోత్కపల్లివైపు వస్తుండగా కనుకుల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. యువకుడి హఠాన్మరణంతో మడక గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, శోకంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.