GDWL: ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి, అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దేవాలయంలో అర్చనలు నిర్వహించిన అనంతరం, స్వామి వారి చరిత్ర, బ్రహ్మోత్సవాల గురించి ఎస్పీకి వివరించారు.