GNTR: ఫిరంగిపురం మండలంలో వరి పంట పరిస్థితులు, తెగుళ్ల నియంత్రణపై రైతులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో గురువారం శిరంగిపాలెం గ్రామంలో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వాసంతి మాట్లాడుతూ.. వర్షాల అనంతరం వరి పొలాల్లో బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు.