SDPT: 18 ఏళ్లు నిండితేనే డ్రైవింగ్ చేయాలని గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళీ సూచించారు. గురువారం పట్టణంలోని ఓ కళాశాల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి ఆయన అవగాహన కల్పించారు. రోడ్డుపై నడిచేటప్పుడు ఎప్పుడూ ఎడమవైపే నడవాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఏర్పాటుచేసిన సిగ్నల్స్‌ను గమనిస్తూ ప్రయాణించాలన్నారు. మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని, చట్ట ప్రకారం నేరం అన్నారు.