MDK: తూప్రాన్ పట్టణంలోని కూరగాయల నర్సరీలను జిల్లా ఉద్యాన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, జిల్లా వ్యవసాధికారి దేవకుమార్ సందర్శించారు. నర్సరీ యజమానులతో సమావేశం నిర్వహించి తెలంగాణ నర్సరీ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రైతులకు నాణ్యమైన నారు మాత్రమే అందజేయాలని పేర్కొన్నారు. ఏవో గంగమల్లు, ఉద్యాన శాఖ అధికారి రచన పాల్గొన్నారు.