SRPT: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణా, ప్రలోభాలను అరికట్టేందుకు జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లాకు ఆనుకుని ఉన్న సరిహద్దులు వెంట మొత్తం 7 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశామన్నారు.