AP: ప్రభుత్వం చిన్నారుల ఆరోగ్యంపై ఫోకస్ పెట్టింది. అంగన్వాడీ పిల్లల్లో పోషకాహార లోపాన్ని (Malnutrition) తగ్గించేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చిన్నారులకు బలవర్ధకమైన ‘పల్లీ చిక్కీలు’ పంపిణీ చేయాలని నిర్ణయించింది. పిల్లలకు ఐరన్, ప్రోటీన్ అందించడమే దీని లక్ష్యం. రక్తహీనతను తగ్గించి, పిల్లలు దృఢంగా ఎదిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.