శబరిమల అయ్యప్ప స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర అటవీశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వాడకం నిషేదమని ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో అలువా నది వద్ద స్వాముల దగ్గర ఉన్న ప్లాస్టిక్ కవర్లను తీసుకుని వాటి స్థానంలో పేపర్ బ్యాగులు ఇస్తున్నారు. ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.