TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన ఈ ప్రభుత్వ దుస్థితికి నిదర్శనమని ఆరోపించారు. పాడైన అన్నం పెట్టారని విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని గుర్తు చేశారు. ఓయూ విద్యార్థులకు మంచి భోజనం పెట్టలేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.