TG: పాలమూరు జిల్లా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పదేళ్లు నిర్లక్ష్యానికి గురైన నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామన్నారు. రైతులు నష్టపోవద్దని ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ఇచ్చేందుకు ముందుకు వచ్చామన్నారు. దశాబ్ధాలుగా పాలమూరు జిల్లా కరవు, వలసలకు మాత్రమే పేరుగాంచిందన్నారు.