AP: పార్టీ మార్పుపై జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీ మారుతున్నాననే ప్రచారం అవాస్తవం. కులసంఘం సమావేశంలో మాట్లాడిన అంశాలను.. జనసేన పార్టీకి ఆపాదించొద్దు. జనసేనలో నాకు సముచిత స్థానం ఇచ్చారు. కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా జనసేన పనిచేస్తుంది. జనసేనను బలోపేతం చేస్తాం. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ముందుకెళ్తాం’ అని పేర్కొన్నారు.