»Violent Fight Breaks Out Among Tourists During River Rafting In Rishikesh Watch Video
Viral Video: కెమెరా పెట్టిన చిచ్చు.. తెప్పలోనే తుక్కుతుక్కు కొట్టుకున్నారు
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో రివర్ రాఫ్టింగ్‌లో పర్యాటకుల మధ్య జరిగిన షాకింగ్ వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గంగా నది మధ్యలో తెడ్డులతో ఒకరినొకరు హింసాత్మకంగా కొట్టుకుంటున్న పర్యాటకుల సమూహాలను ఇందులో చూడవచ్చు.
Viral : ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో రివర్ రాఫ్టింగ్(river rafting)లో పర్యాటకుల మధ్య జరిగిన షాకింగ్ వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది. గంగా నది(Ganga River) మధ్యలో తెడ్డులతో ఒకరినొకరు హింసాత్మకంగా కొట్టుకుంటున్న పర్యాటకుల సమూహాలను ఇందులో చూడవచ్చు. ఈ సంఘటన శనివారం జరిగినట్లు ప్రముఖ వార్తా సంస్థ నివేదించింది.
సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్న ఈ వీడియోలో, రాఫ్టింగ్ గైడ్లు, పర్యాటకులు ఒకరినొకరు తెడ్డులతో కొట్టుకోవడం చూడవచ్చు. ఇతర వ్యక్తులు తెడ్డుతో ఒక రైడర్‌పై తీవ్రంగా దాడి చేశారు. ఇంతలో ఆ యువకుడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఏమీ ఆలోచించకుండా నేరుగా గంగ(Ganga)లో దూకుతాడు. ఇంతలో ఇతర తెప్పల్లో ఉన్నావారు అతనికి సహాయం చేస్తారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కానీ పర్యాటక శాఖ అధికారులు(Officials of Tourism Department) మాత్రం ఈ గొడవ గురించి పట్టించుకోవడం లేదు. ఈ విషయమై తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అంటున్నారు.
గో ప్రో కెమెరా వివాదానికి కారణం:
అందుతున్న సమాచారం ప్రకారం ఈ వివాదానికి అసలు మూలం గో ప్రో కెమెరా. ఈ కెమెరాతో పర్యాటకులు గంగానది అలలను, దాని సాహసాలను చిత్రీకరిస్తారు. దీనికి బదులుగా, గైడ్లు పర్యాటకుల నుండి ఇష్టానుసారంగా డబ్బు వసూలు చేస్తారు. ఈ గొడవకు కారణం కూడా అదే గో ప్రో కెమెరా అని అంటున్నారు. ఈ ఘటనపై గంగా రివర్ రాఫ్టింగ్ రొటేషన్ కమిటీ ప్రెసిడెంట్ దినేష్ భట్ మాట్లాడుతూ.. టూరిస్టులు, గైడ్ల మధ్య ఘర్షణ జరిగితే పర్యాటక శాఖ చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతే కాకుండా ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Uttarakhand | A violent scuffle broke out among rafters during river rafting in Rishikesh, yesterday. On the incident, SP Tehri Garhwal, Navneet Bhullar said that the police are investigating the incident after which a case will also be registered in this matter. pic.twitter.com/dRAs4MiUB9