టీమిండియా ఆసియా కప్‌ను కైవసం చేసుకోవడంలోనూ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ఏడు మ్యాచుల్లో ఏకంగా 200 స్ట్రైక్‌రేట్‌తో 314 పరుగులు చేశాడు. తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించే అభిషేక్ టీమిండియాకు కీలక బ్యాటర్‌గా.. ప్రత్యర్థి జట్లను హడలెత్తిస్తున్నాడు. అభిషేక్ ఓ 6 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే 60 నుంచి 80 పరుగులు చేసేస్తాడని బౌలర్లు బెంబేలెత్తుతున్నారు.