ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత మహిళా జట్టు ప్రధాని మోదీకి ఓ ప్రత్యేక బహుమతిని అందజేశారు. జట్టు సభ్యులంతా సంతకాలు చేసిన భారత క్రికెట్ జెర్సీని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మోదీకి బహమతిగా ఇచ్చింది. ‘నమో’ పేరుతో ఉన్న ఆ జెర్సీపై ‘1’ అని ముద్రించారు. ఈ సందర్భంగా మోదీ వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్లేయర్లతో కలిసి ప్రత్యేకంగా ఫొటో కూడా తీసుకున్నారు.