SKLM: ఎల్.ఎన్.పేట మండలం అలికాం -బత్తిలి ప్రధాన రహదారి నుంచి ముంగన్నపాడు గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారిపోయింది. సుమారు రెండు దశాబ్దాలకు పైగా రోడ్డు మరమ్మతులు చేపట్టకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మొత్తం గుంతులుగా మారిపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ద్విచక్ర వాహనంపై కూడా వెళ్లలేని దుస్థితి ఉందన్నారు.