NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ పెద్ద చెరువులో బుధవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లలను వదిలారు. గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు బుంగపట్ల తిమ్మయ్య మాట్లాడుతూ.. 72 వేల చేప పిల్లలు చెరువులో వదలడం ద్వారా 100 కుటుంబాలకు ఉపాధి కలుగుతుందన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.