NLG: చండూరు మండలంలో నిత్యం కురుస్తున్న అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ పార్టీ జిల్లా నాయకులు కళ్లెం సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి నష్టం అంచనా వేయాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30 వేల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని తెలిపారు.