VKB: పరిగి మండల పరిధిలోని ప్రమాదకర ప్రాంతాలను (అక్సిడెంట్ ప్రోన్ ఏరియాలు) సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై మోహన్ కృష్ణ బుధవారం సందర్శించారు. ఇందులో భాగంగా రంగాపూర్ గ్రామ ప్రజలకు రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, రాంగ్ రూట్లో వెళ్లకూడదని సూచించారు. తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించి ప్రయాణించాలని కోరారు.