GNTR: తాడేపల్లి మండలం పోలకంపాడు గ్రామం కొత్తూరు ఎస్టీ కాలనీలోని రేకుల షెడ్డులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.69,200, 11 సెల్ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.