NZB: ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మంగళవారం అంకాపూర్‌లో MLA పైడి రాకేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బీటీ రోడ్డు, లింకు రోడ్డు, ఐమాక్స్ లైట్లు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందిస్తూ ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు MLA పైడి రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు.