కర్నూలు బస్సు ప్రమాద దుష్ప్రచారం కేసులో వైసీపీ నాయకురాలు శ్యామల సోమవారం డీఎస్పీ బాబు ప్రసాద్ ఎదుట విచారణకు హాజరై 2 గంటల పాటు ప్రశ్నించబడ్డారు. శివశంకర్ మద్యం తాగారన్న ఆరోపణలకు ఆధారాలు అడగ్గా ఆమె సమాధానం ఇవ్వలేక, అధిష్ఠానం ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడానని తెలిపినట్లు సమాచారం. ఆమెతో పాటు మరో నలుగురిని కూడా పోలీసులు విచారించినట్లు పేర్కొన్నారు.