KRNL: ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శశిధర్ సోమవారం తెలిపారు. ఆదోనిలోని పెద్దహరివాణం బీసీ హాస్టల్‌ను సందర్శించి సమస్యలను తెలుసుకున్నామన్నారు. మెస్ ఛార్జీలు చాలడం లేదని, కాస్మొటిక్ ఛార్జీల మొత్తాన్ని పెంచాలన్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెల్లి పరిష్కారం చేస్తామన్నారు.